ఇద్దరు భారతీయులకు మెగసెసె పురస్కారం
అయినవారి నిరాదరణకు గురై రోడ్లపై అస్తవ్యస్తంగా బతుకుతునన మానసిక దివ్యాంగులకు ఆయన అక్షరాల దేవుడే. మానసికవ్యాధి నిపుణుడైన ఆయన అలాంటి అనాథ మానసిక దివ్యాంగులను తన క్లినిక్కు తీసుకువచ్చి చికిత్స చేసి, ఆశ్రయమిచ్చి అన్నం పెట్టి వారిని మామూలు మనుషులను చేస్తున్నారు. ఆయన పేరు డాక్టర్ భారత్ వాట్వానీ. సమాజంలోని మానసిక దివ్యాంగులకు కొత్త వెలుగునిచ్చిన ఆయనకు ఈ ఏడాది రామన్ మెగసెసె అవార్డు లభించింది. వాట్వానీతోపాటు జమ్మూ కశ్మీరుకు చెందిన సంఘసేవకు సోనమ్ వాంగ్చుక్కు కూడా మెగసెసె అవార్డు దక్కింది. వారిలో ఇద్దరు భారతీయులు ఉన్నారని రామన్ మెగసెసె అవార్డు ఫౌండేషన్ ప్రకటించింది.













