విశాల్‌కు బంపరాఫర్
అన్నాడీఎంకేలో సంక్షోభం సమసిపోయేందుకు సీఎం ఈపీఎస్, డిప్యూటీ సీఎం ఓపీఎస్లు పదవుల నుంచి తప్పుకోవాలని పార్టీ వెలివేత డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దినకరన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు అందజేసిన లేఖలపై గవర్నర్ తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అనంతరం హీరో విశాల్‌తో దినకరన్ భేటీ అయ్యారు. విశాల్‌కి నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని, ఆయన రాజకీయాల్లో రావాలనుకుంటే తాను ఆహ్వానిస్తానని పేర్కొన్నారు. కానీ దినకరన్ వ్యాఖ్యలపై విశాల్ స్పందించలేదు. మర్యాదపూరకంగానే ఇద్దరి మధ్య భేటీ జరిగినట్లు విశాల్ తెలిపారు.













