రూ.699 నుంచీ విమాన ప్రయాణం
ఎంపిక చేసిన మార్గాల్లో తక్కువ ధరకే టిక్కెట్లు విక్రయిస్తున్నట్లు ట్రూజెట్ ప్రకటించింది. జూన్ 9 వరకు ఈ టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ నెల జూన్ 20 నుంచి సెప్టెంబరు 30 మధ్య ప్రయాణించేందుకు ఆఫర్‌పై లభించే ఈ టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. చెన్నై-కడప-చెన్నై మార్గంలో రూ.699, విజయవాడ-కడప-విజయవాడ మార్గంలో రూ.899, హైదరాబాద్ నుంచి బళ్లారి, నాందేడ్‌లకు రూ.899, విజయవాడ- హైదరాబాద్‌కు రూ.1,299, కడప-హైదరాబాద్‌కు రూ.1.399, తిరుపతి-హైదరాబాద్‌కు రూ.1.499, హైదరాబాద్ -రాజమహేంద్రవరం రూ.1,599, హైదరాబాద్-విజయవాడ రూ.1.599, హైదరాబాద్-గోవా-హైదరాబాద్ రూ.1,799, హైదరాబాద్-తిరుపతి రూ.1,699, హైదరాబాద్ నుంచి చెన్నై, ఔరంగాబాద్‌లకు రూ.1,999లుగా టిక్కెట్ల ధరలు ఉన్నాయి. వీటితోపాటు పలు ఇతర మార్గాల్లోనూ ఈ తక్కువ ధర టిక్కెట్లు అందుబాటులో ఉన్నట్లు సంస్థ పేర్కొంది.













