విమానాల్లోనూ మొబైల్ సేవలు
విమానంలో ప్రయాణీకులకు మొబైల్ టెలిఫోన్, ఇంటర్నెట్ సౌకర్యాలను అనుమతించాలని ట్రాయ్ సిఫార్సు చేసింది. దేశంలో ఉపగ్రహ, టెరిస్ట్రియల్ నెట్వర్క్ ద్వారా వారికి ఈ సౌకర్యం కల్పించాలని సూచించింది. దేశ గగన తలంలో ఇన్-ఫ్లయిట్ కనెక్టివిటి (ఐఎఫ్సి) ఈ సేవలను అందించాలని కోరింది. ఐఎఫ్సి పై ట్రాయ్ ప్రత్యేకంగా సిఫారస్సు చేసింది. టెలికామ్ శాఖ ట్రాయ్ను గత ఆగస్టు 10న కోరిన మీదట ఆ సంస్థ సూచనలు అందించింది. మొబైల్ సేవలలో క్యాబిన్లో కూడా ఫోన్, నెట్ సౌకర్యం కోసం ప్రత్యేక సౌకర్యాలు ప్రొవైడర్లు అందించాలని కూడా సిఫార్సు చేసింది.













