తిరుచానూరు బ్రహ్మూెత్సవాలు ప్రారంభం
తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మూెత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చుకులు పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా అష్టదిక్పాలకులు, సకల దేవతామూర్తులను ఉత్సవాలకు ఆహ్వానిస్తూ గజపటాన్ని స్వర్ణకవచ ధ్వజస్తంభంపైకి అధిరోహింపజేశారు. ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల మధ్య ధనుర్ లగ్నంలో ధ్వజారోహణం ఘట్టాన్ని నిర్వహించారు. అంతకు ముందు ధ్వజస్తంభంపై ఉన్న గజ ప్రతిమకు స్నపన తిరుమంజనం చేసి బలి నివేదనం సమర్పించారు. అనంతరం గజ పటానికి ప్రత్యేక పూజలు చేసి ధ్వజస్తంభం పైకి ఎగురవేడయంతో బ్రహ్మూెత్సవాలు ప్రారంభం అయ్యాయి.













