2020 జర జాగ్రత్త!
డాక్యుమెంట్లు, బ్యాంక్చెక్కులు, ఉత్తర ప్రత్యుత్తరాలు తదితర విలువైన కాగితాలు, ఒప్పందపత్రాలపై తేదీ ఫార్మాట్ సంపూర్ణంగా, సమగ్రంగా రాయకపోతే కష్టాలు తప్పవు. తేదీ, నెలతో పాటు సంవత్సరాన్ని సూచించే అంకెలను పూర్తిగా రాయకుంటే కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్టే. తేదీ ఫార్మాట్లో సాధారణంగా తేదీ..నెల..సంవత్సరం రాయడం ఆనవాయితీ. చాలామందికి సంవత్సరంలోని చివరి రెండు అంకెలను మాత్రమే రాయడం అలవాటు. ఉదాహరణకు 15వ తేదీ, 12వ నెల, 2019 సంవత్సరాన్ని 15.12.12019 రాయడానికి బదులుగా 15.12.19 అని రాస్తుంటారు. ఇదే అలవాటును 2020లో కూడా కొనసాగిస్తే ఊహించని ప్రమాదాలు ఎదురుకావచ్చు. సంవత్సరాన్ని తెలిపేచోట పూర్తిగా రాయకుండా 20ని పొడిగా రాసి ఊరుకుంటే.. మీతో ఒప్పందం చేసుకున్నవారికి ఎప్పుడైనా దుర్బుద్ధి కలిగితే, దానిపక్కన మరో రెండు అంకెలు చేర్చే ప్రమాదం ఉంటుంది. 2000 నుంచి 2099 వకు తమకు అనుకూలమైన అంకెలు వేసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వీలుంటుంది. అలాంటి చాన్స్ ఇవ్వకుండా ఉండాలంటే ఎవరైనా, ఏ పత్రంమీదైనాసరే సంవత్సరం పేరును 2020గా సంపూర్ణంగా రాయాలని నిపుణులు సూచిస్తున్నారు.













