భారత్ లో ఉన్న అమెరికన్లు వెనక్కి
కరోనా ముప్పుతో వివిధ దేశాలు అంతర్జాతీయ సరిహద్దుల్ని మూసివేయడంతో దాదాపుగా 30 వేల మందికి పైగా అమెరికా పౌరులు ఇతర దేశాల్లో చిక్కుకుపోయారు. వారిని వెనక్కి రప్పించడానికి అమెరికా ఏర్పాట్లు చేస్తోంది. భారత్లో ఉన్న అమెరికన్లు తిరిగి స్వదేశానికి తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది. భారత్ లాక్డౌన్ సమయంలో అక్కడే ఉండిపోయిన ఈ తరుణంలో భారత ప్రభుత్వం తమకు చాలా సాయం చేస్తోందని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ వారాంతం నుంచి న్యూఢిల్లీ, ముంబై నుంచి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి అమెరికన్లను వెనక్కి తెస్తామని తెలిపింది.













