18న కువైట్ లో మినీ మహానాడు
గల్ఫ్ దేశామైన కువైట్లో ఈ నెల 18న మినీ మహానాడు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని) హాజరై ప్రసంగించనున్నారు. కువైట్లో 3 లక్షల పైగా తెలుగు వాళ్లు ఉండగా కువైట్ టీడీపీ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకరరావు ఆహ్వానం మేరకు ఎంపీ కేశినేని నాని మూడురోజుల (17,18,19 తేదీలలో ) పాటు కువైట్లో పర్యటించనున్నారు. కువైట్లో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బాబు, కార్యదర్శి రామ్మోహన్, ఉప కార్యదర్శి రాధామాధవ్, టెజ్రరర్ రమేష్ నాయుడు నేతృత్వంలోని పూర్తి కమిటీ సభ్యులతో ఈ కార్యక్రమాన్ని భారీగా ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు.













