ఆ పార్టీ తోనే సంక్షేమ పాలన సాధ్యం
ఎన్నికల్లో డబ్బులిస్తే తీసుకోండి కానీ ఓటు మాత్రం మీ భవిష్యత్ కోసం ఆరాట పడే పార్టీకే వేయండని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ప్రజాప్రస్థాన యాత్ర సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఐదేళ్ల పాలనలో వైఎస్ఆర్ ఎంతో అభివృద్ధి చేశారు. ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకొని పథకాల రూప కల్పన చేశారు. అందుకే ప్రతి పథకం ప్రజల గుండెల్లో నిలిచి పోయిందన్నారు. ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి పన్ను పెంచలేదు. గ్యాస్ సిలిండర్ ధర పెరిగితే ఆ డబ్బును ప్రభుత్వమే భరించింది. ముఖ్యమంత్రి అంటే వైఎస్ఆర్. మళ్లీ వైఎస్ఆర్ ప్రతి పథకాన్ని అద్భుతంగా అమలు చేసి చూపిస్తా. మొదటి సంతకం భారీగా ఉద్యోగాల కల్పన మీద పెడతా. మహిళల ఆర్థికాభివృద్ధికి కృసి చేస్తా. ఇంట్లో వృద్ధులందరికీ పింఛన్ మంజూరు చేస్తాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతోనే సంక్షేమ పాలన సాధ్యం అని అన్నారు.













