హైదరాబాద్లో వివర్క్ సేవలు ప్రారంభం
కో వర్కింగ్ స్థలాన్ని అందించే అమెరికాకు చెందిన వివర్క్ హైదరాబాద్కు విస్తరించింది. ఇక్కడ రెండు కేంద్రాలను ఏర్పాటు చేసి మొత్తం 7,000 సీట్లను అందుబాటులోకి తెచ్చింది. మాదాపూర్లో 2.5 లక్షల చదరపు అడుగుల్లో 4,000 సీట్లు, ఫైనాన్సియల్ జిల్లాలో 2 లక్షల చదరపు అడుగుల్లో 3,000 సీట్లు ఉండనున్నాయి. ఈ సంస్థకు దేశ వ్యాప్తంగా 32 నగరాల్లో మొత్తం 55,000 సీట్ల సామర్థ్యం ఉంది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ దీన్ని ప్రారంభించారు. హైదరాబాద్కు కో వర్కింగ్ స్పేస్లు, అంకుర ఇన్క్యుబేటర్లు అధికంగా వస్తున్నాయని తెలిపారు. వివర్క్ కో చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ ర్యాన్ బెన్నెట్ మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం దేశంలో సేవలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకూ 2 కోట్ల చదరపు అడుగుల కో వర్కింగ్ స్పేస్లో 25 శాతం వాటాను దక్కించుకున్నట్లు చెప్పారు. కో వర్కింగ్ స్పేస్లో పనిచేసేందుకు యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని, స్మార్ట్ ఆఫీసులుగా వీటిని భావిస్తున్నారని చెప్పారు. ఒక్కో సీటుకు రూ.6,000 దాకా అద్దె వసూలు చేయబోతున్నట్లు తెలిపారు.













