నిఘా అధికారులకు అమెరికా కాన్సులేట్ శిక్షణ
పాస్పోర్టు, వీసాలకు సంబంధించి జరుగుతున్న మోసాలు, వాటి నివారణపై అమెరికన్ కాన్సులేట్ అధికారులు తెలంగాణ నిఘా విభాగ అధికారులకు తాజాగా ప్రత్యేక శిక్షణ అందించారు. రాష్ట్ర పోలీసు అకాడమీలో అమెరికా కాన్సులేట్, అకాడమీ అధికారులు సంయుక్తంగా ఇంటెలిజెన్స్ అధికారులకు డిటెక్టింగ్ ఇంపోస్టర్స్ అండ్ ప్రాడ్యులెంట్ వీసాస్ అనే అంశంపై ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లే నుంచి సుమారు 60 మంది ఇంటెలిజెన్స్ అధికారులు ఇందులో పాల్గొన్నారు. అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ తరహా శిక్షణ కార్యక్రమాలు మున్ముందు మరిన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.













