13న శ్రీవారి దివ్యక్షేత్రం ప్రారంభం
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో నూతనంగా నిర్మించి శ్రీవారి దివ్యక్షేత్రంలో ఈ నెల 8వ తేదీన అంకురార్పణ చేయబోతున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో బి.లక్ష్మీకాంతం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9వ తేదీన కంకణం, 13న ఆలయ ప్రారంభోత్సవం జరుగుతాయన్నారు. ఇప్పటికే ఆలయాన్ని రెండు మార్లు తనికీ చేసినట్టు తెలిపారు. 8,9 తేదీల్లో అంకురార్పణ, కంకణం, 13న జరిగే ప్రారంభోత్సవం కార్యక్రమాల కోసం తాను హైదరాబాద్ వెళ్లనున్నట్టు తెలిపారు. ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎవరు హాజరవుతారో చెప్పలేమని, అది ఎన్నికల షెడ్యూలు ప్రకటనపై ఆధారపడి ఉంటుదని తెలిపారు.













