నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ ఘన విజయం

నాగార్జున సాగర్ గడ్డపై మరోసారి గులాబీ జెండా రెపరెపలాడింది. సాగర్ ప్రజలు గులాబీ జెండాను గుండెలకు హత్తుకున్నారు. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‍ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. టీఆర్‍ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ 18,804 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కౌంటింగ్ పూర్తయ్యే సరికి టీఆర్‍ఎస్‍కు 89,804 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‍కు 70,932 ఓట్లు, బీజేపీకి 7,676 ఓట్లు, టీడీపీ 1,714 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థులకు 2,915 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో జానారెడ్డి రెండో స్థానంలో ఉండగా, బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. ఉప ఎన్నిక వేళ అధికార పార్టీ దివంగత ఎమ్మెల్యే నర్సింహయ్య కుమారుడు భగత్‍ను బరిలో నిలిపింది. కాంగ్రెస్ తరపున సీనియర్ నాయకుడు జానారెడ్డి పోటీ పడ్డారు. బీజేపీ నుంచి రవికుమార్ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. దివంగత టీఆర్‍ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతిలో సాగర్‍లో ఉప ఎన్నిక నిర్వహించిన విషయం తెలిసిందే.