ఓటేసిన సినీ ప్రముఖులు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు వేశారు. ఈ సందర్భంగా వాళ్ళు తాము ఓటు హక్కును వినియోగించుకున్నామని అందరూ వచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రానా ముందుగా ఓటు వేశారు. చిరంజీవి తన భార్య సురేఖ, కూతురు శ్రీజతో కలిసి జూబ్లీహిల్స్‌లో ఓటు వేసేందుకు వచ్చారు. మరోవైపు ఎన్టీఆర్ తన సతీమణి ప్రణతి, తల్లితో కలిసి ఓటు వేసేందుకు వచ్చారు. వెంకటేష్ ఒంటరిగా వచ్చాడు, శ్రీకాంత్ తన కుటుంబంతో సహా ఓటు వేయడానికి వచ్చారు. అల్లు అర్జున్ సోలోగా వచ్చి ఓటు వేశారు. అక్కినేని నాగార్జున కుటుంబంతో సహా వచ్చి ఓటు వేశారు. టాలీవుడ్ యంగ్ హీరోలు నితిన్, కళ్యాణ్ రామ్, రవితేజ, రాజేంద్ర ప్రసాద్ లు కూడా ఓటేశారు. బ్రహ్మానందం, విజయశాంతి, బండ్ల గణేశ్, సుధీర్ బాబు, దర్శకులు సుకుమార్, తదితరులు కూడా ఓటు వేసిన వారిలో ఉన్నారు.













