ఇక్కడే కేసీఆర్ తో ఎమ్మెల్యేలకు సమస్య…?
సాధారణంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ మొండి వైఖరితో ముందుకు వెళ్తారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతుంటాయి. సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకునే విషయంలో ఎవరి సలహా ఇచ్చిన ఎవరి అభిప్రాయలు వ్యక్తం చేసినా సరే ఆయన పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయరు అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినబడుతూ ఉంటాయి. అందుకే టిఆర్ఎస్ పార్టీలో చాలా మంది నేతలు సీఎం కేసీఆర్ తో అవసరమైన విషయాల కంటే కూడా అనవసరమైన విషయాలను ప్రస్తావిస్తూ ఉంటారని యోగక్షేమాలకు ఇచ్చిన ప్రాధాన్యత అవసరమైన అంశాలను ఇచ్చే ప్రయత్నం చేయరు అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.
రాజకీయంగా సీఎం కేసీఆర్ బలంగా ఉండటంతో కొంత మందిని లెక్కచేసే ప్రయత్నం కూడా చేయడం లేదు. దీని వలన నియోజకవర్గంలో సమస్యల తీవ్రత పెరిగి పోతుంది. అందుకే చాలా మంది మంత్రులు కూడా ఇప్పుడు కొంత మంది ఎమ్మెల్యేల విషయంలో కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కొంత మంది ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదని ఆవేదనగా ఉన్నారు. ప్రధానంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు విషయంలో సీఎం కేసీఆర్ అలసత్వం ప్రదర్శించడంతో కొన్ని నియోజకవర్గాల్లో సమస్యలు వస్తున్నాయి అని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్వయంగా సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయి. 3, 4 నియోజకవర్గాల్లో మాత్రమే మెదక్ జిల్లా లో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ఎక్కువగా జరుగుతుంది. అలాగే సిద్దిపేట జిల్లాలో కూడా పరిస్థితి దాదాపు అలాగే ఉంది. ఉమ్మడి ఉమ్మడి రంగారెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలలో ఈ విషయంలో తీవ్ర స్థాయిలో సమస్యలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు విషయంలో తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు కూడా చేసింది.
కాబట్టి సీఎం కేసీఆర్ కొన్ని అంశాల మీద శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్లకపోతే సమస్యల తీవ్రత పెరిగే అవకాశాలు ఉండవచ్చు. భారతీయ జనతా పార్టీ నేతలు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద దృష్టి పెట్టిన నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గిరిజనులను భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. నాగార్జునసాగర్ ఎన్నికల్లో గిరిజనుల మీద దృష్టి పెట్టి ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి నాగార్జునసాగర్ లో సీటు ఇచ్చింది. కాబట్టి సీఎం కేసీఆర్ జాగ్రత్తగా లేకపోతే ఊహించని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉండవచ్చు.













