జయేష్ రంజన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్‌కు ప్రతిష్టాత్మక స్విడన్ రాయల్ ఆర్డర్ ఆఫ్ పొలార్ స్టార్ అవార్డ్ దక్కింది. భారత పర్యటనలో ఉన్న స్విడన్ రాజు కార్ల్ గుస్టాఫ్, రాణి సిల్వియా అవార్డును అందజేశారు. ఈ అవార్డ్‌కు 400 ఏళ్ల చరిత్ర ఉంది. స్విడన్ ఆసక్తులను అనుగుణంగా సహకారం, ద్వైపాక్షిక బంధాలకు కృషి చేసిన విదేశీయులకు స్విడన్ ఈ అవార్డులను ప్రకటిస్తుంది. తెలంగాణలో స్విడన్ పెట్టుబడులు పెట్టేందుకు జయేష్ రంజన్ కృషి చేయడంతో ఈ అవార్డ్ దక్కింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కియా స్టోర్ కూడా స్విడన్‌కు చెందినదే. జయేష్ రంజన్‌ను మంత్రి కేటీఆర్ ప్రశంసించారు.













