నయీం డైరీస్ కు హైకోర్టు బ్రేక్
నయీం డైరీస్ చిత్ర ప్రదర్శనను నిలిపి వేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సినిమాలో బెల్లిలలిత పాత్రను అసభ్యకరంగా చిత్రీకరించారంటూ ఆమె కుమారుడు సూర్య ప్రకాష్ హైకోర్టును ఆశ్రయించారు. 1999లో బెల్లి లలిత దారుణ హత్యకు గురయ్యారు. బెల్లి లలితను నయీం హత్య చేయించాడంటూ అప్పట్లో కుటుంబ సభ్యులు ఆరోపించారు. విడుదలైన నయీం డైరీస్ సినిమాలో బెల్లి లలిత క్యారెక్టర్ అయిన లతను నయీం లిప్ కిస్ చేసే దృశ్యాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ దృశ్యంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ చిత్రాన్ని నిలిపివేయాలంటూ సూర్య ప్రకాష్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చిత్ర డైరెక్టర్, ప్రొడ్యూసర్లకు హైకోక్టు నోటీసులు జారీ చేసింది. విచారణను వాయిదా వేసిన కోర్టు అప్ప వరకు నయీ డైరీస్ చిత్ర ప్రదర్శన స్టే విధించింది.













