ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. సిట్ కు చుక్కెదురు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌కు చుక్కెదురైంది. ప్రభుత్వ రివిజన్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఏసీబీ కోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది. కేసులో నలుగురిని నిందితులుగా చేరుస్తూ సిట్ మోమో జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్, శ్రీనివాస్‌లను ఈ కేసులో నిందితులుగా చేరుస్తూ గతంలో సిట్ మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ ముగ్గుర్నీ నిందితులుగా చేర్చడాన్ని తోసిపుచ్చిన అనిశా కోర్టు ఇటీవల సిట్ మెమోను కొట్టివేసింది. దీంతో సిట్ బృందం హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం సిట్ అప్పీలును కోటివేస్తూ తీర్పు వెలువరించింది.













