చస్తారా… చేస్తారా అనే పరిస్థితి కల్పించారు, ప్రజల ప్రాణాలు అంటే మీకు లెక్కలేదు: తెలంగాణా హైకోర్ట్

తెలంగాణాలో కరోనా కేసులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్ట్ చాలా సీరియస్ గా ఉంది. కేసులు నమోదు అవుతున్నా సరే రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టుదలగా ఎన్నికలను నిర్వహించాలని భావిన్చాడంపై తెలంగాణా హైకోర్ట్ సీరియస్ అయింది. మున్సిపల్ ఎన్నికలు సజావుగా, జాగ్రత్తగా నిర్వహించాలని ఎస్ఈకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. నేడు దీనికి సంబంధించి విచారణ జరిగింది. ప్రజలు గుమిగూడి కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీకి ఆదేశాలు జారీ చేసింది.
మద్యం దుకాణాలు మూసి వేయాలని ప్రభుత్వానికి హైకోర్ట్ సూచనలు చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు ఎస్ఈసీ కార్యదర్శి అశోక్ కుమార్ హాజరయ్యారు. ఎన్నికల విధుల్లో 2557 పోలీసులు సహా 7695 మంది ఉద్యోగులు ఉంటారని ఈసీ వివరించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం తీరు అత్యంత బాధాకరం అని హైకోర్ట్ ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘాన్ని సంఘం పనితీరు సరిగా లేదు అని మండిపడింది. కరోనా విపత్తులో ఎన్నికలు వాయిదా వేయకుండా ముందుకెళ్లడం బాధాకరమని పేర్కొంది.
గతంలో హైదరాబాద్ మేయర్ స్థానం ఏడాదిన్నర ఖాళీగా ఉంది కదా అని ప్రశ్నించింది. ప్రజలు, ఉద్యోగుల ప్రాణాలను ఫణంగా పెట్టి ఎన్నికల నిర్వహిస్తున్నారని మండిపడింది. ఉద్యోగులకు చేస్తారా? చస్తారా అనే పరిస్థితి కల్పించారని హైకోర్టు వ్యాఖ్యలు చేసారు. ప్రపంచమంతా కరోనాతో యుద్ధం చేస్తుంటే.. ఎస్ ఈసీ దృష్టి ఎన్నికల పై ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్ఈసీ అధికారులు అంగారక గ్రహం పై ఉన్నారేమో అంటూ వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం కూడా ఎన్నికల కు సన్నద్ధత వ్యక్తం చేయడం ఆశ్చర్యమని మండిపడింది కోర్ట్.
నేడు ఉదయం విచారణ సందర్భంగా కూడా హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలకు ఎందుకు ముందుకు వెళ్లారని హైకోర్ట్ ప్రశ్నించింది. ప్రజల ప్రాణాలు విలువైనవా? ఎన్నికలా? అని సూటిగా ప్రశ్నించింది. యుద్ధం వచ్చినా.. ఆకాశం మీద పడినా ఎన్నికలు జరగాలసిందేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్ఈసీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులు గమనిస్తున్నారా? అని మండిపడింది. ఎస్ఈసీ అధికారులు భూమిపై నివసిస్తున్నారా? ఆకాశంలోనా? అంటూ వ్యాఖ్యలు చేసింది. కొన్ని మున్సిపాలిటీల ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కదా అని నిలదీసింది.