కోవిడ్ పరిస్థితులపై హైకోర్టుకు నివేదిక సమర్పించిన ప్రభుత్వం
కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను సవివరంగా వివరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు ఓ నివేదికను సమర్నించింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు 3.5 శాతంగా ఉందని ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. కరోనా పరీక్షల పెంపుకు తాము చర్యలు చేపడుతున్నామని, ఈ నెల 1 నుంచి 25 వరకూ మొత్తం 23.55 లక్షల కరోనా పరీక్షలను తాము నిర్వహించామని, వీటిలో 4.39 లక్షల ఆర్టీపీసీఆర్, 19.61 లక్షల ర్యాపిడ్ పరీక్షలున్నాయని పేర్కొంది. కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో మద్యం దుకాణాలు, పబ్‌లు నిబంధనలు పాటించేలా చర్యలుె చేపడుతున్నామని, మద్యం దుకణాలను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ తగు చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం వివరించింది. అలాగే రాష్ట్రానికి 430 టన్నుల ఆక్సిజన్‌ను కేంద్రం కేటాయించిందని, వివిధ ప్రాంతాల నుంచి ఆక్సిజన్‌ను చేరవేస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో పాజిటివ్ రేటు 3.5 శాతంగా ఉందని ప్రభుత్వం పేర్కొంది. అలాగే రెమిడేసివిర్ పర్యవేక్షణ నిమిత్తమై నోడల్ అధికారిగా ప్రీతిమీనాను నియమించామని ప్రభుత్వం పేర్కొంది.













