తెలంగాణలో పోలింగ్ ప్రశాంతం
తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎక్కడా చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదని, సురక్షిత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని అన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న భద్రతా సిబ్బందికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. పోలీసులు, ఎన్నికల సిబ్బందికి ప్రజలు బాగా సహకరించారని మహేందర్ రెడ్డి అన్నారు.













