ఐదు నగరాల్లో టీహబ్
తెలంగాణలో టీ హబ్‌ను ఐదు నగరాలకు విస్తరిస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శాసనసభలో చెప్పారు. అంకుర పరిశ్రమలను ప్రోత్సహించడానికే టెక్నాలజీ ఇంక్యూబేటర్‌ను నెలకోల్పామన్నారు. రెండో దశలో 3.60 లక్షల చదరపు అడుగుల విస్తీరంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ ఏర్పాటు కాబోతోందని కేంద్రం సై న్స్ అండ్ టెక్నాలజీ నివేదిక ప్రకారం దేశంలో అత్యధిక ఇంక్యుబేటర్లు ఉన్న నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందిందని చెప్పారు. ప్రస్తుత గ ణాంకాల ప్రకారం 346 అంకుర ఇంక్యుబేటర్లు ఉన్నాయని, 835 అనుబంధ అంకురాలు, 190 పూర్వ అంకురాలు, 117మెంటార్స్, 32 సామాజిక భాగస్వామ్యాలు, 27 ఐపి ట్రేడ్ మార్కులు, 23 వ్యాపార మద్దతు సేవలు ఈ హబ్ ద్వారా సాధించిన విజయాలని అన్నారు. నెల ఒక్కంటి కీ 376 మెంటార్ సెషన్స్ జరుగుతున్నాయని, నె లకు 16 ఈవెంట్లు జరుగుతున్నాయని చెప్పారు. 27 మంది వైస్ ఛాన్సలర్లు ఐటి హబ్‌ను సందర్శించారని మంత్రి వెల్లడించారు.













