రాజ్యసభ బరిలోకి కాంగ్రెస్
రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలపాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ పార్టీ విప్ సంపత్‌కుమార్ తెలిపారు. అసెంబ్లీ కమిటీహాల్లో జరిగిన సీఎల్పీ భేటీ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు స్థానాల్లో ఒక దానికి తాము పోటీ పడుతామని ప్రకటించారు. అభ్యర్థి ఖరారు విషయాన్ని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఖుంటియా, టీపీసీసీ అద్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీకి అప్పజెబుతూ తీర్మానం చేశామన్నారు. కాంగ్రెస్ బీ ఫామ్‌పైనే అభ్యర్థి పోటీ చేస్తారన్నారు. 3 గంటలపాటు సుదీర్ఘంగా సాగిన భేటీలో 25 అంశాలను చర్చించామన్నారు. రుణమాఫీ, వడ్డీ, మద్దతు ధర, నిరుద్యోగ సమస్యలను శానససభలో లేవనెత్తుతామన్నారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని సృష్టం చేశారు. 13న ఎమ్మార్పీస్ తలపెట్టిన బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలనీ సీఎల్పీ నిర్ణయించినట్లు తెలిపారు.













