తెలంగాణ హైకోర్టుకు 12 మంది జడ్జిలు : సుప్రీం కోర్టు
తెలంగాణ హైకోర్టుకు 12 మంది జడ్జిల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఇందులో ఏడుగురు న్యాయవాదులు, ఐదుగురు న్యాయధికారులు ఉన్నారు. న్యాయవాదులు కాసోజు సురేందర్, చాడ విజయ్ భాస్కర్ రెడ్డి, సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్ కుమార్, జువ్వాడి శ్రీదేవి, మీర్జా సైఫీయుల్లా బేగ్, నాచరాజు శ్రవణ్ కుమార్ వెంకట్ పేర్లను కొలీజియం సిఫారసు చేసింది. అదేవిధంగా పదోన్నతి కోసం కొలీజియం సిఫారసు చేసిన న్యాయాధికారుల్లో జీ.అనుపమ చక్రవర్తి, ఎంజీ ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఎం. సంతోష్‌రెడ్డి. డీ.నాగార్జున ఉన్నారు.













