ఎమ్మెల్యే రాజాసింగ్ కు భద్రత పెంపు
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ప్రభుత్వం భద్రత పెంచింది. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో రాజాసింగ్ ఇంటి వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. ద్విచక్ర వాహనంపై తిరగవద్దని, ప్రభుత్వ బుల్లెట్‌ఫ్రూఫ్ కారులో వెళ్లాలని ఎమ్మెల్యేకు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ సూచించారు. డీసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో రాజాసింగ్ భద్రతను పర్యవేక్షించనున్నారు. భద్రత పెంపు అంశంపై రాజాసింగ్ స్పందించారు. తనకు ఎవరి నుంచి ప్రాణహాని ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయం కేంద్ర, రాష్ట్ర హోంశాఖ మంత్రులకు లేఖ రాస్తానని రాజాసింగ్ తెలిపారు.













