తెలంగాణ యువకుడికి ఫోర్బ్స్ ఇండియా గుర్తింపు
ప్రముఖ బిజినెస్ పత్రిక ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన టాప్ 100 డిజిటల్ స్టార్స్‌లో తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన యువకుడికి చోటు లభించింది. ఆయన 32వ స్థానంలో నిలిచారు. యైటింక్లైన్ కాలనీకి చెందిన సయ్యద్ హఫీజ్ యూట్యూబ్‌లో నిర్వహిస్తున్న తెలుగు టెక్టట్స్కు ఈ గుర్తింపు లభించింది. కంప్యూటర్‌పై పరిజ్ఞానం ఉన్న సయ్యద్ 2011లో తెలుగు టెక్‌టట్స్ పేరిట ఛానల్ ప్రారంభించారు. అప్పటి నుంచి సెల్‌ఫోన్ వినియోగంతోపాటు వాటి ప్రత్యేకతలు, లాభనష్టాలపై వీడియోలు చేస్తున్నారు.













