ఎంపీ అభ్యర్థితో ఆలింగనం.. ఎఎస్‌ఐ సస్పెండ్

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన సైదాబాద్ ఏఎస్ ఉమాదేవి సస్పెండ్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతను ఆమె ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసు శాఖ చర్యలు తీసుకుంది. ఉమాదేవీని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.