రేవంతూ… ఎంత పని చేశావయ్యా…!!
రేవంత్ రెడ్డి పాదయాత్ర… టీ కాంగ్రెస్ లో ఇదో ఉప్పెన ఇప్పుడు. ఉప్పెన సృష్టిస్తా కేసీఆర్ ని ఆ ఉప్పెనతో కప్పేస్తా అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట తెరాసకు ఎంత గుచ్చుకున్నాయో గాని… టీ కాంగ్రెస్ నేతలకు మాత్రం గుచ్చుకుని బాగా హర్ట్ చేసాయి. వాళ్ళను పర్సనల్ గా ఇబ్బంది పెడుతున్నాయి ఆ మాటలు. పార్టీలోకి వచ్చి నాలుగేళ్ళు కాలేదు మమ్మల్ని కాదని ముందుకు వెళ్తాడా అంటూ గాంధీ భవన్ లో కూర్చుని మీడియా సమావేశం పెట్టాలో వద్దో అర్ధం కాని స్థితిలో ఆ పార్టీ నేతలు ఉన్నారు.
మరి కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన ఏంటి అసలు…? అదోక్కసారి మనం చూద్దాం. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల సమయంలో తెరాస పార్టీ నేతల విమర్శలే హైలెట్ అయ్యాయి. బిజెపి చేసిన విమర్శలకు తెరాస ఘాటుగా సమాధానం ఇవ్వడం, అర్ధం కాని లాజిక్ లు కొందరు బిజెపి నేతలు చెప్పడం జరిగాయి. మీడియా మొత్తాన్ని కూడా ఆక్రమించారు వాళ్ళు. ఇక కాంగ్రెస్ నేతలు దుబ్బాకను, గ్రేటర్ ను మేమే అభివృద్ధి చేసాం… చెరుకు ముత్యం రెడ్డి, పీజేఆర్ అంటూ ఏదేదో మాట్లాడారు. సరే వాళ్ళు మాట్లాడింది మీడియాలో వచ్చిందా…?
చూద్దామన్నా కనపడలేదు… సోషల్ మీడియాలో కూడా వాళ్ళే కనిపించారు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఒక ఆలోచన చేసింది. ఇప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ నేతలు ఉంటే ఉంటారు పోతే పోతారని రేవంత్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది. మీరు నడవండి మీ వెనుక మేమున్నాం అంటూ రాహుల్ గాంధీ నుంచి పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అందుకే రేవంత్ రెడ్డి సభకు సీనియర్లు దూరమైనా కీలక నేతలు అందరూ వెళ్ళారు. షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ వంటి నేతలు అందరూ కూడా వెళ్ళారు.
ఎక్కడా ఎవరూ ఆగలేదు… స్థానిక నేతలు 16 జిల్లాల డీసీసి అధ్యక్షులు అందరూ వచ్చేశారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి… సందేశం పంపారు. తెరాస నేతలను ఎదుర్కోవాలి అంటే, క్యాడర్ లేని బిజెపిని కట్టడి చేయాలి అంటే రేవంత్ కరెక్ట్ అని భావించిన అధిష్టానం… రేవంత్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ముందుకు నడిపిస్తుంది. ఇప్పటి వరకు చూసి చూడనట్టు వదిలేసిన కాంగ్రెస్ అధిష్టానం… నాగార్జునసాగర్ ఉప ఎన్నికల తర్వాత… పార్టీని ప్రక్షాళన చేయడానికి రెడీ అయిపోయారు. నాగార్జునసాగర్ టికెట్ విషయంలో కూడా రేవంత్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది.
దుబ్బాక, హుజూర్ నగర్, గ్రేటర్ ఎన్నికల్లో చూసి చూడనట్టు వదిలేసిన కాంగ్రెస్ అధిష్టానం… తెరాస మీద వ్యతిరేకత ఉందా లేదా అనే విషయాన్ని సర్వే ద్వారా తెలుసుకుని సిద్దమైంది. తెరాస నుంచి ఎవరు పోటీ చేసినా సరే సోదిలో బిజెపి లేకుండా ఉండేలా రాజకీయం చేయడానికి రెడీ అయింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బిజెపికి అభ్యర్ధి కూడా లేరు అనే విషయం అర్ధమవుతుంది. అందుకే ఇప్పుడు రేవంత్ ని రంగంలోకి దించి పార్టీని పరోక్షంగా ప్రక్షాళన చేయడం మొదలుపెట్టెసింది. మరి ఎంత వరకు సక్సెస్ అవుతుందో…?













