రైతులకు రివాల్వింగ్ ఫండ్ ఇస్తే తప్పేంటి ?
తెలంగాణ రాష్ట్రంలో ఆలయాలకు కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారని, రైతులకు రివాల్వింగ్ ఫండ్ ఇస్తే తప్పేంటని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. జహీరాబాద్లో తమ సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలుపుతున్న చెరుకు రైతులకు సంఫీుభావం తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ చెరకును ప్రభుత్వమే కర్ణాటక మిల్లులకు తరలించాలన్నారు. మద్దతు ధర కల్పిస్తే రైతుబంధు, భీమా, రుణమాఫీ అవసరం ఉండదన్నారు. అసెంబ్లీలో చెరకు రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. చెరకు ఫ్యాక్టరీలు నడిపించలేని సీఎం రాష్ట్రానికి ఎలా నడిపిస్తారని ప్రశ్నించారు.













