ఈ అంశంపై తాము సీబీఐకి ఫిర్యాదు చేస్తాం : రేవంత్
ఎమ్మెల్యే కొనుగోలు కేసులో అసలు దోషి ఎవరు? అంటూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ అవసరాల కోసం దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారన్నారు. 2018 నుంచి జరిగిన ఫిరాయింపులపై విచారణ జరగాలని, త్వరలో ఈ అంశంపై తాము సీబీఐకి ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును రెండు కోణాల్లో చూడాలి. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలను బాధితులుగా చూపిస్తున్నారు. మరి ఇందులో దోషి ఎవరు? నేరం జరిగింది కానీ విచారణ తామే చేస్తాం అనడం ద్వారా బీఆర్ఎస్ లోపం బయటపడిరదన్నారు. నేరమే జరగలేదని అంటూనే సీబీఐ విచారణ అడగడం ద్వారా బీజేపీ లోపం బయటపడుతుంది. సీబీఐ విచారణ అనగానే బీజేపీ, సిట్ విచారణ అనగానే బీఆర్ఎస్ ఎందుకు సంకలు గుద్దుకుంటున్నాయని అని అన్నారు.













