మాస్టర్ ప్లాన్ వేసిన రేవంత్ రెడ్డి…?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎంత వరకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి ఏంటి అనే దానిపై ఇప్పుడు చాలా వరకు చర్చలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ… షర్మిల దెబ్బకు పూర్తిగా ఖాళీ అయ్యే అవకాశాలున్నాయని ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. తెలంగాణలో వైయస్ షర్మిల విషయానికి వస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆమె పూర్తిగా నాశనం చేసే విధంగానే అడుగులు వేస్తున్నారని అందుకే షర్మిల పార్టీ పెట్టే ఆలోచన చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది నేతలు ఆమె వద్దకు వస్తున్నారని టాక్.
షర్మిల కొన్ని వర్గాలను ఎక్కువగా టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం తోపాటుగా క్రైస్తవ మతం కూడా ఎక్కువగానే ఉంది. కాబట్టి ఇప్పుడు షర్మిల వాళ్ళను ఎక్కువగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈ రెండూ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రధాన బలంగా ఉన్నాయి. వీటిని ఆమె టార్గెట్ చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో నష్టపోయే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి కొన్ని వ్యూహాలను అమలు చేసే విధంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
రేవంత్ రెడ్డి పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు పదవి వచ్చిన వెంటనే పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి కొన్ని కొన్ని సమస్యలను పరిష్కరించే అవకాశాలు కనబడుతున్నాయి. నియోజకవర్గాల్లో ఉన్న నాయకత్వ సమస్య మీద కూడా ఆయన ఇప్పుడు క్రమంగా దృష్టిసారిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకు పూర్తి అధికారాలు ఇవ్వడం తో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని చెప్పాలి.
అయితే ఇప్పుడు పాదయాత్ర ద్వారా ఆయన ప్రతి నియోజక పరిధిలో సభ ఏర్పాటు చేసి షర్మిల పార్టీ పెట్టడం వెనుక కాంగ్రెస్ పార్టీ నాశనం ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించే అవకాశాలున్నాయి. షర్మిల పార్టీ పెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీని పరోక్షంగా టార్గెట్ చేస్తున్నారని దీని వెనుక కొన్ని శక్తులు ఉన్నాయని క్రైస్తవ మతాన్ని టార్గెట్ చేయడానికి ఆమె కొంత మందిని రంగంలోకి దించారు అని రేవంత్ ప్రజల్లోకి తీసుకువెళ్ళవచ్చు. అంతేకాకుండా రెడ్డి సామాజిక వర్గానికి గాలం లాక్కోవడానికి రాజకీయం మొదలు పెట్టారు చెప్పే అవకాశం ఉంది. పలు అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయనున్నారు. ఇప్పటివరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ ఇక నుంచి మాత్రం సోషల్ మీడియా మీద దృష్టి పెట్టడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు రెడీ అయ్యారు. నాగార్జున సాగర్ ఎన్నికల తర్వాత దాదాపుగా రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.













