రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్ అయిపోయారు…?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆశాదీపంలా కనబడుతున్నారు. రేవంత్ రెడ్డిని నమ్ముకునే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో కొన్ని కొన్ని కీలక మార్పులు కూడా చేయాల్సిన సమయం వచ్చింది అనే భావన కొంతమందిలో వ్యక్తమవుతున్నది. రాజకీయ అంశాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణకు సంబంధించి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డికి కొంతమంది నేతల నుంచి సహకారం అందడం లేదు.
దీంతో రేవంత్ రెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని ఈ మధ్యకాలంలో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ విషయంలో కాస్త సైలెంట్ గా ఉండటంతో అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ను తీవ్రస్థాయిలో విమర్శించారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నేతలతో స్నేహం చేస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఇటీవల బిజెపి లో కొంతమంది కీలక నేతలు కూడా రేవంత్ రెడ్డి పై కొన్ని ఆసక్తికర విమర్శలు చేశారు. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లొంగిపోయారు అంటూ వ్యాఖ్యలు చేయడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి పై చాలా ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆయనకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని భావించారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విషయంలో పాదయాత్ర కూడా రేవంత్ రెడ్డి చేసే అవకాశం ఉందని అన్నారు. ఇటీవల ఆయన కాస్త స్వల్ప పాదయాత్ర ఒకటి చేసారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి చేసే అవకాశాలు ఉన్నాయని భావించారు. దీనికి సంబంధించి ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.
రేవంత్ రెడ్డితో విభేదిస్తున్న రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ నేతలను కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పక్కన పెట్టింది అనే భావన ఉంది. ఇలాంటి తరుణంలో రేవంత్ రెడ్డి సైలెంట్ అవ్వడం వెనుక అసలు ఏం జరుగుతుంది ఏంటనేది అర్థం కాలేదు. ఓటుకు నోటు కేసు విషయంలో రేవంత్ రెడ్డి ఇప్పుడు కాస్త ఇబ్బంది పడుతున్నారని ఏసీబీ కోర్టులో ఆయనకు శిక్ష పడే అవకాశాలు కూడా ఉండవచ్చు అని అందుకే రేవంత్ రెడ్డి కాస్త సైలెంట్ గా ఉన్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.













