జస్టిస్ ఎన్వీ రమణకు అక్కినేని పురస్కారం
అక్కినేని నాగేశ్వరరావు 99వ జయంతిని పురస్కరించుకొని రసమయి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో జస్టిస్ ఎన్వీ రమణకు రసమయి-అక్కినేని జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్ర పూర్వ గవర్నర్ పీఎస్ రాంమోహన్ రావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ 16 నెలల కాలంలో తీసుకొచ్చిన సంస్కరణలు అనితర సాధ్యమని కొనియాడారు. న్యాయవ్యవస్థకే వన్నె తెచ్చిన జస్టిస్ ఎన్వీ రమణకు ఈ పురస్కారం ప్రదానం చేయడం సంతోషంగా ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ టీ సుబ్బరామిరెడ్డి, మాజీ ఎంపీ సీనియర్ నటుడు మురళీమోహన్, సాహితీవేత్త ఆచార్య కొలకలూరి ఇనాక్, పద్మభూషణ్ డాక్టర్ కేఐ వరప్రసాద్ రెడ్డి, ఐటీశాఖ మాజీ చీఫ్ కమిషనర్ ఎం నరసింహప్ప, అక్కినేని కుటుంబీకులు నాగసుశీల, సుప్రియ, రసమయి సంస్థ అధ్యక్షుడు డాక్టర్ ఎంకే రాము తదితరులు పాల్గొన్నారు.













