పాకిస్థానీ అని పిలిస్తే శిక్షించాల్సిందే
భారతీయ ముస్లింలను ఎవరైనా పాకిస్థానీ అని పిలిస్తే వాళ్లకు కఠిన శిక్ష వేయాలని ఏఐఎంఐఎం పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఇండియన్ ముస్లిమ్ను పాకిస్థాన్‌గా పిలిచే వారిని శిక్షించేందుకు చట్టాన్ని తయారు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో భాగంగా ఆయన లోక్‌సభలో మాట్లాడారు. భారత ముస్లింలను పాకిస్థాన్‌గా పిలిచే వారికి మూడేళ్ల జైలు శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. కానీ బీజేపీ ప్రభుత్వం అలాంటి చట్టాన్ని చేయలేదని విమర్శించారు. భారత్‌లో నివసిస్తున్న ముస్లింలు మొహమ్మద్ అలీ జిన్నా ప్రతిపాదించిన రెండు దేశాల సిద్ధాంతాన్ని వ్యతిరేకించారని, అయినా కానీ భారతీయులు, ముస్లింలను వేరుగా చూస్తున్నారని అన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లు కూడా మహిళలకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు.













