ముచ్చింతల్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ రాక

శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం ముచ్చింతల్‌కు రానున్నారు. 13వ తేదీ మధ్యాహ్నం ఢల్లీి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో జీయర్ ఆశ్రమానికి వెళ్తారు. దాదాపు రెండుగంటల పాటు దివ్యక్షేత్రంలో గడుపుతారు. శ్రీరామానుజాచార్యుల 120 కిలోల స్వర్ణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తరువాత రామానుజ చార్యుల భారీ విగ్రహాన్ని సందర్శించి, ఆడిటోరియంలో ప్రసంగిస్తారు. రాష్ట్రపతి సాయంత్రం హెలికాప్టర్ట్‌లో బయలుదేరి బేగంపేటకు, అక్కడ నుంచి రోడ్డుమార్గంలో రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం 10:30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళతారు.