ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని : రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు పంపి వేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సోమేష్ కుమార్ తీసుకున్న పలు నిర్ణయాలపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సిఎస్ నియామకం ఆక్రమం అని తామే మొదటి నుండి చెబుతున్నామని, తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తాము చెప్పిందే నిజమైందని అన్నారు. బిహార్ ముఠాకు సోమేశ్ లీడర్ అంటూ అనర్హుడైన ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని అన్నారు. సోమేశ్ కుమార్ సీఎస్ హోదాలో తీసుకున్న నిర్ణయాలు సమీక్షించాలన్నారు. సోమేశ్ కుమార్ తీసుకొచ్చిన ధఱణి పోర్టల్ రద్దు చేయాలని కోరారు. కోర్టు తీర్పుతో నైనా తెలంగాణ ప్రాంత ఐఎఎస్ లకు ఇప్పటికైనా ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు.













