ప్రపంచ శాస్త్రవేత్తల జాబితాలో ఓయూ ప్రొ.కవికిషోర్ కు స్థానం
అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం ప్రచురించిన ప్రపంచ ప్రముఖ శాస్త్రవేత్తల జాబితాలో ఓయూ ప్రొ.పీబీ కవికిషోర్ స్థానం దక్కించుకున్నారు. ఓయూ జెనెటిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కవి కిషోర్‌కు ఆ విభాగంలో చేసిన పరిశోధనలకు గాను గుర్తింపు లభించిందన్నారు. సైటేషన్ కౌంట్, హెచ్ ఇండెక్స్, ఐ టెన్ ఇండెక్స్ సహా 44 పరిశోధన అంశాల ఆధారంగా స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం ప్రపంచంలోని శాస్త్రవేత్తలతో రూపొందించిన జాబితాలో ప్రొ.కవికిషోర్కు స్థానం కల్పించారు.













