ఓయూకు పూర్వ విద్యార్థి రూ.5 కోట్ల విరాళం

ఉస్మానియా యూనివర్సిటీలోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆధునిక తరగతి గదుల కాంప్లెక్స్‌లో నిర్మాణానికి పూర్వ విద్యార్థి గోపాల్ టీకే కృష్ణ రూ.5 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. 1968లో ఓయూలో ఆయన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం అమెరికాలో వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ సెమినార్ హాల్‌కు ప్రొ.వి.ఎం.గాడ్గిల్ ఆడిటోరియంగా, కమ్యూనిటీహాల్‌కు ప్రొ.అబిద్ అలీ పేర్లను పెట్టాలని సూచించారు. విరాళం అందించిన కృష్ణను వీసీ ప్రొ.రవీందర్ అభినందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొ.లక్ష్మీనారాయణ, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.చంద్రశేఖర్, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు విజయ్ కుమార్, ఓఎస్డీ ప్రొ.రెడ్యానాయక్ పాల్గొన్నారు.