నిజామాబాద్ లో బీఆర్ఎస్ కు మద్దతుగా.. ఎన్నారైల ప్రచారం
నిజామాబాద్లో బీఆర్ఎస్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గణేష్ బిగాల అభ్యర్థిత్వాన్ని మద్దతిస్తూ గడప గడపకు వివిధ ప్రాంతాలలో ఎన్నారైలు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎన్నారై గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల మాట్లాడుతూ తెలంగాణ సాధనలో ముందున్న ప్రవాస భారతీయులు తాజాగా ఈ ఎన్నికల ప్రచారంలోనూ ముందున్నారన్నారు. సీఎం కేసీఆర్ నిర్వహించే ప్రతి కార్యక్రమానికి ఎన్ఆర్ఐలమంతా కూడా సంఫీుభావం తెలుపుతున్నామని తెలిపారు. బీఆర్ఎస్ గెలుపు కోసం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఎన్నారైలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎం చేయడానికి 52 దేశాల ప్రతినిధులందరు దిశ నిర్దేశం చేసుకొని పనిచేస్తున్నామని అన్నారు.
బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ మహేష్ మాట్లాడుతూ తెలంగాణలో పాటు రాజధాని హైదరాబాద్ అభివృద్ధి కేసీఆర్ దూరదృష్టి, ఆలోచన, ప్రణాళిక, నిబద్ధతకు నిదర్శనం అన్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు, రైతుబంధు అమలు తీరు చూసి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని తెలిపారు. ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మచలం మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ఎంఎల్ఏ అభ్యర్థి గణేష్ బిగాల తెలంగాణ ఉద్యమం నుంచి బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారని అన్నారు. నిజామాబాద్ నగరంలో ఎటవంటి గొడవలు లేకుండా ప్రజలంతా శాంతియూత వాతావరణంలో ఉన్నారని తెలిపారు. ప్రచారంలో పాల్గొన్న ఎన్నారైలు కారు గుర్తుకి ఓటు వేసి గణేష్ బిగాలని గెలిపించాలని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చందు తల్లా, అశోక్, నవీన్, శ్రీనివాస్ జక్కి రెడ్డి, సతీష్, అహ్మద్, బిందులు పాల్గొన్నారు.













