దేశ చరిత్రలోనే ప్రథమం… ఇది తెలంగాణకే గర్వకారణం
దళిత బంధు పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమని, ఇది అట్టడుగువర్గాలకు అత్యున్నత ఆసరా అని అమెరికా ప్రవాస భారతీయులు (యూఎస్ఏ ఎన్ఆర్ఐ) ప్రతినిధులు పేర్కొన్నారు. ఇది తెలంగాణ చరిత్రను తిరగరాసే పథకం అవుతుందని వారు పేర్కొన్నారు. దళిత బంధు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రవేశ పెట్టడం మన ముఖ్యమంత్రి కేసీఆర్కు దళితుల పట్ల ఉన్న చిత్తశుద్దిని చూపిస్తుందని అన్నారు. పదిలక్షల రూపాయాల ఆర్థిక సాయంతో పాటు, ప్రభుత్వ కాంటాక్టులు, వ్యాపార లైసెన్సుల్లోనూ దళితులకు కోటా ఇవ్వడం దేశ చరిత్రలోనే ప్రథమమని అన్నారు. ఇది తెలంగాణకే గర్వకారణమని వారు పేర్కొన్నారు. టీఆర్ఎస్ అమెరికా విభాగం కన్వీనర్లు చందు తాళ్ల, పూర్ణ భైరి, వెంగల్ జలగం, అరవింద్ తక్కళ్లపలి, నరసింహ నాగులవంచ, హరీష్ రెడ్డి, వెంకట్ సక్రునాయక్లు దళిత బంధు పథకంపై హర్షం వ్యక్తం చేశారు.













