ఏపీ వాసులకు తెలంగాణలో నో ఎంట్రీ
ముంబై నుంచి సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశిస్తున్న 39 మందిని పోలీసులు అడ్డుకున్నారు. ఓ ప్రైవేటు బస్సులో వస్తుండగా, జిల్లా సరిహద్దులోని చిరాక్‌పల్లి వద్ద వారిని నిలిపివేశారు. వారంతా విజయవాడ, రాజమండ్రి, సమీప ప్రాంతాలవారే. ఉపాధి కోసం వీరంతా ఖతర్, ఒమన్‌కు వెళ్లారు. ఖతర్ నుంచి 34 మంది, ఒమన్ నుంచి ఐదుగురు ముంబై వచ్చారు. పరీక్షలు నిర్వహించిన ముంబై పోలీసులు, ఏపీ వెళ్లేందుకు అనుమతించారు. వారి బస్సును జిల్లా సరిహద్దులో నిలిపివేశారు. దీంతో వారంతా కర్ణాటకలోని బొంగూరు గ్రామంలోని హోటళ్లకు వెళ్లారు.













