అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే … కొత్త రాజ్యాంగం
అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే కొత్త రాజ్యాంగం అవసరమని కేసీఆర్ అన్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టీఆర్ఎస్ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలకు మెదడు లేదు, కాంగ్రెసోళ్లకు అతీగతీ లేదన్నారు. బడ్జెట్లో అణగారిన వర్గాలకు న్యాయం జరగలేదని సీఎం కేసీఆర్ ఆవేదనతో మాట్లాడారు. కేసీఆర్ మాటాలను బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వక్రీకరించి వివాదం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని కోపోద్రిక్తులయ్యారు. బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయం మీద మాట్లాడకుండా కాంగ్రెస్, బీజేపీ కొత్త రాజ్యాంగ ప్రతిపాదన మీద మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు.
బడ్జెట్లో తెలంగాణకు ఏం ఇచ్చారో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఎక్కడున్నాయో కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొందిన కిషన్రెడ్డి ఈ మూడేండ్లలో ఒక్క లక్ష రూపాయాలైన తెచ్చిండా? అని ప్రశ్నించారు. అంబేద్కర్ను అవమానించిన అరుణ్ శౌరీని కేంద్రమంత్రిగా చేసింది బీజేపీ కదా? అని ప్రశ్నించారు. వాజ్ పేయి హాయంలో రాజ్యాంగాన్ని సమీక్షించేందుకు కమిషన్ వేయలేదా? అని అడిడారు. బీజేపీ కి పబ్లిసిటీ పిచ్చి పట్టింది. సోషల్ మీడియా, మీడియాలో కనిపించేందుకు ఇష్టమెచ్చిన్నట్లు వాగుతున్నారు. బీజేపీ నేతలు ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకోవాలని హెచ్చరించారు.













