నిజాం కళాశాల గ్రాడ్యుయేషన్డే వేడుకల్లో మంత్రి కేటీఆర్
ఉద్యోగాల కోసం విద్యార్థులు ఎదురుచూడటం కాకుండా, ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలని మంత్రి కేటీఆర్ అన్నారు. నిజాం కాలేజీ హాస్టల్ భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం కళాశాల గ్రాడ్యుయేషన్డే వేడుకల్లో కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 80 వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తున్నామని తెలిపారు. ఏడేళ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఆనందించే రోజు ఇది అన్నారు. విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురుచూడటం కాకుండా, గొప్పగొప్ప ఆశయాలతో గొప్పగా ఆలోచించి ఉద్యోగాలు సృష్టించే స్థాయికి చేరుకోవాలని అన్నారు. ప్రైవేటు సెక్టారులో కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు తెలంగాణకు వస్తున్నాయన్నారు. మన భారతీయులు ప్రపంచ స్థాయి కంపెనీలకు అధిపతులుగా ఉన్నారు. ప్రపంచస్థాయి కంపెనీలుగా మన దేశ సంస్థలు కూడా ఎదగాలన్నారు.













