ఆటలో కూడా హరీష్ గట్టివాడే…
తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు రాజకీయ రంగంలో కాకుండా ఆటలో కూడా బెస్ట్ అని అనిపించుకున్నాడు. తనలో మంచి క్రికెటర్ దాగున్నారన్న విషయాన్ని ఆట ద్వారా వెల్లడించారు. సిద్దిసేట జిల్లా క్రికెట్ అసోసియేషన్, మెడికవర్ ఆసుపత్రి జట్ట మధ్య నిన్న రాత్రి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జరిగింది. టి20 ఫార్మట్ లో జరిగిన ఈ మ్యాచ్ లో సిద్దిపేట క్రికెట్ అసోసియేషన్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మంత్రి హరీష్ రావు, జిల్లా ఎస్పీ డేవిస్ సిద్దిపేట తరఫున ఆడారు. ఈ మ్యాచ్ లో హరీష్ రావు 12 బంతులను ఎదుర్కొని మూడు ఫోర్లతో 18 పరుగులు చేశారు.













