ఇది దేశవ్యాప్తంగా జరగాలి : మెగాస్టార్ చిరంజీవి
తెలంగాణ సంస్కృతిలో అలయ్ బలయ్ భాగంగా ఉందని ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ కార్యక్రమానికి మెగాస్టార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తమ ఇంటికి వచ్చి ఆహ్వానించారని చెప్పారు. గతంలో పవన్‌కల్యాణ్, అల్లు అరవింద్ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం వచ్చిందని గుర్తు చేశారు. అలయ్ బలయ్‌కు విస్తృత ప్రాచుర్యం కల్పించిన వ్యక్తి దత్తాత్రేయ అని అన్నారు. ఇది ఉన్నతమైన కార్యక్రమమని తెలిపారు.సాధారణంగా విద్య, వైద్యం వైజ్ఞానిక కార్యక్రమాలు ఉంటాయని, కానీ ప్రేమ, సౌభ్రాతృత్వం పంచే అద్బుతం అలయ్ బలయ్ అని ఆయన కొనియాడారు. ఇది దేశవ్యాప్తంగా జరగాలని ఆకాంక్షించారు. మనం చెప్పలేని భాషను గుండె చప్పుడు చెబుతుందని మానవత్త విలువలు మరిచిపోకూడదన్నారు. మాటకు లొంగని వ్యక్తి హృదయ స్పందనకు లొంగుతారని తెలిపారు.













