మన యాత్రి యాప్ ప్రారంభం

ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఇక నుంచి ఓలా, ఊబర్ వంటి సంస్థలకు కమీషన్ చెల్లించకుండా నేరుగా కస్టమర్ నుంచే డబ్బులు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మన యాత్రి యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఎస్‌బీ డీన్ మదన్, జస్ పే సంస్థ అధికారులతో కలిసి యాప్‌ను టీహబ్ సీఈవో శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు. యాప్ ద్వారా వినియోగదారులకూ భారం తగ్గి డ్రైవర్లకు మరింత అదనపు ఆదాయం చేకూరనుందని తెలిపారు. తమ సంపాదనలో 30 నుంచి 40 శాతం కమీషన్‌కే పోయేదని, ఇక నుంచి ఆ బాధ ఉండదని పలువురు ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు.