మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. అతడిని తప్పకుండా ఎన్కౌంటర్
హైదరాబాద్ నగరంలోని సింగరేణికాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యం ఆపై హత్య చేసిన నిందితుడిని వదిలిపెట్టబోమని, అతడిని తప్పకుండా ఎన్కౌంటర్ చేస్తామని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణికాలనీతో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లే పరిస్థితి లేనందున తాము అక్కడకు వెళ్లలేదని అన్నారు. త్వరలోనే ఆ కుటుంబాన్ని పరామర్శించి నష్టపరిహారాన్ని అందజేస్తామని తెలిపారు.













