కార్మికులతో కలిసి భోజనం చేసిన కేటీఆర్
పారిశుద్ధ్య కార్మికులతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్యాహ్నం భోజనం చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ భవన్లో పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం నిర్వహించారు. వారితో కాసేపు ముచ్చటించిన కేటీఆర్ కలిసి భోజనం చేశారు. కార్మికులతో సెల్ఫీలు దిగారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త ఏడాదిని పురస్కరించుకొని కేటీఆర్‌ను కలిసి పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.













