కేటీఆర్కు వినూత్నరీతిలో జన్మదిన శుభాకాంక్షలు
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని కూకట్పల్లికి చెందిన పార్టీ యువ నాయకుడు పాటిమీది జగన్మోహన్రావు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. 2,100 రూబిక్స్ క్యూబ్లతో కేటీఆర్ రూబిక్స్ క్యూబ్ పోర్టైట్ను రూపొందించారు. తన అభిమాన నేతకు కొత్తగా శుభాకాంక్షలు తెలుపాలన్న ఆలోచనలో రూబిక్స్ క్యూబ్ పోర్టైల్ను రూపొందించామని ఈ సందర్భంగా జగన్మోహన్రావు తెలిపారు. తొమ్మిదో తరగతి చదువుతున్న మేనల్లుడు కౌశిక్, అతని మిత్రుడు శరణ్గుప్తా రెండ్రోజులపాటు శ్రమించి దీనిని రూపొందించినట్టు తెలిపారు.













