ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలను ప్రపంచమంతా ఎన్నారైలు ఘనంగా నిర్వహిస్తారని బీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు. ఈ సందర్భంగా మహేశ్ బిగాల మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కేసీఆర్ జ్మదిన వేడుకలు బ్రహ్మాండంగా జరపాలని వివిధ దేశాల బీఆర్ఎస్ ప్రతినిధులను కోరామన్నారు. కొన్ని దేశాల్లో బ్లడ్ డొనేషన్ డ్రైవ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు సంఫీుభావంగా మొక్కలు నాటడం, అనాథలకు సాయం చేయడం వంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతామన్నారు. ఎన్నారైలంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.













